GT vs MI: ఎలిమినేటర్ మ్యాచ్ రద్దైతే.. క్వాలిఫయర్ 2కు ఏ టీమ్ వెళుతుందంటే?
- మరికొన్ని గంటల్లో గుజరాత్, ముంబై ఎలిమినేటర్ మ్యాచ్
- ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే
- ఎలిమినేటర్ మ్యాచ్ రద్దైతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా మరికొన్ని గంటల్లో గుజరాత్ టైటాన్స్ , ముంబై ఇండియన్స్ జట్లు ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. గెలిచిన జట్టు మాత్రం క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ముల్లాన్‌పూర్ పిచ్ నిన్న బౌలింగ్, బ్యాటింగ్‌కు కూడా అనుకూలించింది. మరి ఈరోజు పిచ్ ఎలా ఉంటుందో అని ఆసక్తికరంగా మారింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ రద్దైతే క్వాలిఫయర్ 2కు ఏ టీమ్ వెళుతుందో చూద్దాం.
Also Read: SV Mohan Reddy: పప్పులు, బెల్లంలా దేవాలయాల భూములను పంచుకుంటే ఊరుకోం.. మాజీ ఎమ్మెల్యే సీరియస్..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 37 డిగ్రీలు, కనిష్ఠంగా 25 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న క్వాలిఫయర్-1 మ్యాచ్ సైతం ముల్లాన్‌పూర్‌లోనే జరగగా.. వర్షం వల్ల ఏ అంతరాయమూ కలగలేదు. ఈరోజు జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. కాబట్టి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే.. గుజరాత్ క్వాలిఫయర్ 2కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ముంబై టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ మూడో స్థానంలో ఉండడమే అందుకు కారణం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?