NTV Telugu Site icon

Yarlagadda VenkatRao: ఒక్కసారి అవకాశం ఇస్తే.. గన్నవరం రూపురేఖలు మారుస్తా..

Yarlagadda

Yarlagadda

గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి దీవిస్తే అభివృద్ధి పరంగా గన్నవరం రూపురేఖలు మారుస్తాను అని టీడీపీ- జనసేన- బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం రామర్పడు గ్రామంలోని హనుమాన్ నగర్, కాలువకట్లపై శుక్రవారం నాడు సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు యార్లగడ్డకు ఎదురేగి పూలమాలలతో దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేయబట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను, అలాగే గన్నవరం నియోజకవర్గంలో తాను చేపట్టబోయే సూపర్ సిక్స్ పధకాలను యార్లగడ్డ వెంకట్రావ్ ప్రజలకు వివరించారు.

Read Also: Kurnool: కర్నూలు జిల్లా కూటమిలో చల్లారని మంటలు

ఇక, గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తనకు ఒక అవకాశం ఇస్తే గన్నవరాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని యార్లగడ్డ వెంకట్రావ్ హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలోని అరాచక శక్తులు ఆట కట్టించడంతో పాటు అవినీతిని అంతం చేస్తానన్నారు. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణ నెలకొల్పేందుకు కృషి చేస్తాను.. ప్రజల ఆస్తులకు ప్రాణాలకు తాను రక్షణగా ఉంటానని తెలిపారు. రామరప్పాడు గ్రామంలోని కాల్వకట్టలపై నివసిస్తున్న వారి సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. వచ్చే నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించడంతో పాటు బందరు పార్లమెంటుకు బాలసౌరికి గాజుగ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read Also: MS Dhoni: క్రికెటరై ఆ బంతిని వేరే అభిమానికి ఇస్తా.. ధోని నుండి బంతిని బహుమతిగా పొందిన పాప..

ఇక, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొడ్డళ్ల చిన్న రామారావు, దండు సుబ్రహ్మణ్య రాజు, కొల్లా ఆనంద్, నభిగాని కొండ, అద్దేపల్లి సాంబు, ముల్లంగి సత్యనారాయణ, పట్టపు చంటి, దూల్లిపూడి సతీష్, దుల్లిపూడి దుర్గారావు, కొంగన రవి, బొమ్మసాని అరుణ కుమారి, తుపాకుల శివాలీల,మత్తే రాధా, కళ్లేపల్లి రామకృష్ణ రాజు, విజ్జి రాము, మెండే అప్పారావు తెలుగు యవత నాయకులు పరుచూరి నరేష్, కళ్లేపల్లి భారత్ వర్మ, రాంబాబు, చిప్పల బాలు, అప్పలరాజు, జనసేన నాయకులు పొదిలి దుర్గ రావు, కాట్రగడ్డ రాంబాబు, రాము, మేకల స్వాతి, కూనపరెడ్డి నాని, అడ్డగిరి రామకృష్ణ, బీజేపీ నాయకులు డాక్టర్ ఫణికుమార్, మల్లికార్జునరాజు, కే నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.