NTV Telugu Site icon

Suryakumar Yadav: హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇస్తే.. వేటు పడేది సూర్యకుమార్‌పై కాదు!

Suryakumar Yadav Sixes

Suryakumar Yadav Sixes

Is Suryakumar Yadav take Shreyas Iyer place once Hardik Pandya is back to Team: వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. చీలమండ నొప్పితో విలవిల్లాడిన హార్దిక్‌.. తన ఓవర్‌ పూర్తిచేయకుండానే మధ్యలోనే మైదానం వీడాడు. ఆపై న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్‌.. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌ ఆరంభించినట్లు తెలుస్తోంది. త్వరలనే భారత తుది జట్టులో అతడు చేరనున్నాడు.

వరల్డ్‌కప్‌ 2023 లీగ్‌ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకుని నవంబరు 15 నాటికి హార్దిక్‌ పాండ్యా జట్టుతో చేరే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. నవంబరు 15న తొలి సెమీ ఫైనల్‌, 16న రెండో సెమీ ఫైనల్‌ ఉండగా.. 19న ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. హార్దిక్‌ను ఆడించే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయట్లేదట. సెమీస్ నుంచే హార్దిక్‌బరిలోకి దిగుతాడని తెలుస్తోంది.

Also Read: Virat Kohli Birthday: కోల్‌కతాలో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌.. 70 వేల విరాట్ కోహ్లీ ఫేస్‌ మాస్క్‌లు సిద్ధం!

హార్దిక్ పాండ్యా జట్టులోకి ఎంట్రీ ఇస్తే.. అతడి స్థానంలో తుది జట్టులో ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌‌పై వేటు పడొచ్చని అందరూ ఊహిస్తున్నారు. అయితే సూర్యకుమార్‌పై కాకుండా శ్రేయాస్ అయ్యర్‌పై వేటు పడనుందట. అందుకు కారణం అతడి పేలవ ప్రదర్శన. ప్రపంచకప్ 2023లో 6 మ్యాచ్‌ల్లో కేవలం 134 పరుగులు చేశాడు. శ్రేయాస్ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అంతేకాదు కీలక సమయంలో క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించకుండా.. చెత్త షాట్లతో పెవిలియన్ చేరాడు. అదే సమయంలో హార్దిక్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సూర్యకుమార్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై సూర్య 49 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కారణంగా సూర్య రనౌట్ అయిన విషయం తెలిసిందే.

 

Show comments