Suryakumar Yadav: హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇస్తే.. వేటు పడేది సూర్యకుమార్‌పై కాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is Suryakumar Yadav take Shreyas Iyer place once Hardik Pandya is back to Team: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. చీలమండ నొప్పితో విలవిల్లాడిన హార్దిక్.. తన ఓవర్ పూర్తిచేయకుండానే మధ్యలోనే మైదానం వీడాడు. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్.. గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ ట్రెయినింగ్ ఆరంభించినట్లు తెలుస్తోంది. త్వరలనే భారత తుది జట్టులో అతడు చేరనున్నాడు.
వరల్డ్‌కప్ 2023 లీగ్ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకుని నవంబరు 15 నాటికి హార్దిక్ పాండ్యా జట్టుతో చేరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. నవంబరు 15న తొలి సెమీ ఫైనల్, 16న రెండో సెమీ ఫైనల్ ఉండగా.. 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. హార్దిక్‌ను ఆడించే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయట్లేదట. సెమీస్ నుంచే హార్దిక్బరిలోకి దిగుతాడని తెలుస్తోంది.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
హార్దిక్ పాండ్యా జట్టులోకి ఎంట్రీ ఇస్తే.. అతడి స్థానంలో తుది జట్టులో ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడొచ్చని అందరూ ఊహిస్తున్నారు. అయితే సూర్యకుమార్‌పై కాకుండా శ్రేయాస్ అయ్యర్‌పై వేటు పడనుందట. అందుకు కారణం అతడి పేలవ ప్రదర్శన. ప్రపంచకప్ 2023లో 6 మ్యాచ్‌ల్లో కేవలం 134 పరుగులు చేశాడు. శ్రేయాస్ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అంతేకాదు కీలక సమయంలో క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించకుండా.. చెత్త షాట్లతో పెవిలియన్ చేరాడు. అదే సమయంలో హార్దిక్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సూర్యకుమార్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై సూర్య 49 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కారణంగా సూర్య రనౌట్ అయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!