Mamata Banerjee: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ ధర పెంచవచ్చని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. గ్యాస్ ధర రూ. 2000 వరకు పెంచవచ్చని గురువారం అన్నారు. ‘‘బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే, వంటగ్యాస్ ధరలను రూ. 1500 లేదా రూ.2000 పెంచవచ్చు. మళ్లీ మనం మంటల్ని వెలిగించేందుకు కలపను సేకరించే పాత పద్ధతికి వెళ్లాల్సి ఉంటుంది’’ అని మమతా బెనర్జీ అన్నారు. ఝర్‌గ్రామ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: BJP: కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం..300 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం..
ఆవాస్ యోజన కింద హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్ నెలఖారులోగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేయకపోతే మేలో ప్రారంభమయ్యే నిర్మాణ ప్రయత్నాలను తమ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని హెచ్చరించారు. ఇటీవల కొన్ని రోజుల నుంచి బెంగాల్‌లో అధికార టీఎంసీ సమస్యల్లో కూరుకుపోయింది. టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్ అఘాయిత్యాలపై సందేశ్‌ఖలి ప్రజానీకం తిరగబడింది. లైంగిక వేధింపులపై మహిళా లోకం ఉద్యమించింది. దాదాపుగా 55 రోజుల పాటు పరారీలో ఉన్న నిందితుడిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మమతా బెనర్జీ సందేశ్‌ఖలీ ఉదంతంపై పెద్దగా మాట్లాడటం లేదు.
