Site icon NTV Telugu

Idli Kottu: ఇడ్లీ కొట్టు సెన్సార్ రివ్యూ

Idli Kottu

Idli Kottu

Idli Kottu: హీరో ధనుష్‌ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.

READ MORE: IND vs PAK: ఈ షరతుకు ఓకే అంటేనే ట్రోఫీ తిరిగి ఇస్తా.. పాక్ మంత్రి మొండిపట్టు..!

147 నిమిషాల పర్ఫెక్ట్ రన్ టైం తో ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్ లభించింది. గత సినిమాలకంటే భిన్నంగా, ఇడ్లీ కొట్టు గ్రామీణ వాతావరణంలో సాగే, భావోద్వేగాలు కథ. ట్రైలర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషనల్‌ లేయర్లతో ధనుష్‌ స్టోరీటెల్లింగ్‌ అదిరిపోయింని తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎస్విఎం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామారావు చింతలపల్లి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌, ప్రమోషన్లు అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ధనుష్‌, నిత్యా మీనన్‌ జంట మరోసారి రీయూనియన్‌ అవ్వడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ తిరు చిత్రంలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. మరోసారి అలరించడానికి సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అద్భుతమైన ప్రీ రిలీజ్ రిపోర్ట్స్‌తో రేపటి నుండి థియేటర్లలో రిలీజ్ అవుతోంది ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.

Exit mobile version