NTV Telugu Site icon

Allu Arjun : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం

Allu Arjun

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. సంధ్య థియోటర్‌ ఘటనలో నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మళ్లీ కోర్టుకు చేరుకున్న ఐకాన్ స్టార్ రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి ష్యూరిటీలు అందజేశారు. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి.. ష్యూరిటీలు సమర్పించారు. కోర్టు తీర్పు ప్రకారం.. యాభై వేల రూపాయల డిపాజిట్ తో పాటు రెండు పూచీకత్తులను సమర్పించారు. అల్లు అర్జున్ వ్యక్తి గతంగా బాండ్‌ సమర్పించడంతో పాటు.. మరో షూరిటీ కింద తన పర్సనల్ మేనేజర్‌ను చేర్చారు.

READ MORE: Delhi: ఢిల్లీలో దారుణం.. పాఠశాలలో గొడవ.. 7వ తరగతి విద్యార్థి హత్య

ఇదిలా ఉండగా.. సంధ్య థియోటర్‌ ఘటనపై నాంపల్లి కోర్టు నిన్న ( శుక్రవారం) అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చార్జిషీట్ దాఖలు చేసే వరకు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 01.00 గంటల వరకు చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు సూచించింది. ప్రతి వ్యక్తికి ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పేర్కొంది. దీంతో పాటు, తనను విచారిస్తున్న పోలీసులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరించవద్దని కోర్టు అల్లు అర్జున్ కు సూచించింది. ఈ కేసులో సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించవద్దని కోర్టు హెచ్చరించింది.

READ MORE: Best Selling Car: డిసెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా.. టాప్ వన్‌లో ఏది ఉందో తెలుసా?

 

Show comments