NTV Telugu Site icon

IND vs AUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! తుది జట్లు ఇవే

Ind Vs Aus Toss

Ind Vs Aus Toss

Australia have won the toss and have opted to bat: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టైటిల్ ఫేవరెట్స్ భారత్, ఆస్ట్రేలియా జట్లు మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంఛుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ దూరం కాగా.. సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్ మరియు జోష్ ఇంగ్లిస్ తుది జట్టులో లేరు.

ఈ మ్యాచ్‌కు భారత స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అనారోగ్యం కారణంగా (డెంగ్యూ ఫీవర్) దూరం అయ్యాడు. గిల్‌ స్ధానంలో మరో యువ ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి వచ్చాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మతో కలిసి ఇషాన్ ప్రారంభించనున్నాడు. మెగా టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో గెలుపుతో ప్రచారాన్ని ఎవరు ప్రారంభిస్తారో చూడాలి.

తుది జట్లు:
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్.

Show comments