Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Icc Womens T20 World Cup 2024 Shifted To Uae From Bangladesh

ICC T20 World Cup 2024: ఐసీసీ కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌కు షాక్!

Published Date :August 21, 2024 , 7:18 am
By Sampath Kumar
  • బంగ్లాలో రాజకీయ అనిశ్చితి
  • ఐసీసీ కీలక నిర్ణయం
  • యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ 2024
ICC T20 World Cup 2024: ఐసీసీ కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌కు షాక్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Womens T20 World Cup 2024 Held in UAE: అందరూ ఊహించిందే జరిగింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024 బంగ్లాదేశ్‌ నుంచి తరలిపోయింది. ప్రస్తుతం బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వచ్చే అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి తరలివెళ్లింది. బంగ్లాదేశ్‌లో పర్యటించడానికి పలు క్రికెట్ దేశాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో టోర్నీ వేదికను తరలించక ఐసీసీకి తప్పలేదు. వేదిక మార్పునకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) కూడా అంగీకరించింది.

‘బంగ్లాదేశ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగకపోవడం నిరాశ కలిగించే విషయం. మెగా టోర్నీని బీసీబీ గొప్పగా నిర్వహించేది. ప్రస్తుతం బంగ్లాలో పర్యటించడానికి చాలా దేశాలు సుముఖంగా లేని నేపథ్యంలో అక్కడ టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదు. అయితే బంగ్లాకు ఆతిథ్య హక్కులు కొనసాగుతాయి. భవిష్యత్తులో ఏదైనా ఐసీసీ టోర్నీని బంగ్లాలో నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. మెగా టోర్నీని నిర్వహించడానికి ముందుకు వచ్చిన యూఏఈ బోర్డును అభినందిస్తున్నాం’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జెఫ్‌ అలార్డిస్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు 3 నుంచి 20 వరకు షెడ్యూల్‌ అయి ఉంది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయమై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రతరం కావడంతో.. ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచివెళ్లారు. మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయినా.. అల్లర్లు ఆగలేదు. దాంతో మంగళవారం వర్చువల్‌గా సమావేశమైన ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్, షార్జాలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • icc
  • T20 World Cup 2024 Bangladesh
  • T20 World Cup 2024 UAE
  • UAE

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions