U19 World Cup 2024: నేడు దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్.. సూపర్ ఫామ్‌లో యువ భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India U19 vs South Africa U19 Semi-Final 1: అండర్-19 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ భారత్‌కు టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నదే తెలియదు. సెమీస్‌కు ముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. అదే జోరు సెమీఫైనల్‌లో కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. పటిష్ట భారత జట్టును నిలువరించడం దక్షిణాఫ్రికాకు కష్టమే అని చెప్పాలి.
అండర్-19 ప్రపంచకప్ 2024లో ఆడిన అన్ని మ్యాచ్‌లలో మూడు విభాగాల్లోనూ భారత్ రాణించింది. రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో ముషీర్ ఖాన్ జోరుమీదున్నాడు. 334 పరుగులు చేసిన ముషీర్.. టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 304 పరుగులు చేసిన కెప్టెన్ ఉదయ్ సహరన్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. నేపాల్ మ్యాచ్‌లో సచిన్ దాస్ సెంచరీ (116) బాదాడు. వీరిని అడ్డుకోవడం ప్రొటీస్ బౌలర్లకు కష్టమే.
Also Read
Also Read: Team India: త్వరలోనే భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది: గ్యారీ కిరిస్టెన్
మరోవైపు యువ భారత్ బౌలింగ్‌లో కూడా రాణిస్తోంది. బౌలర్ సౌమి కుమార్ పాండే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 2.17 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం అంత సులువు కాదు. పేసర్లు నమన్ తివారి, రాజ్ లింబాని కూడా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం అయ్యే ఈ మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది. మరో సెమీస్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడనున్నాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!