NTV Telugu Site icon

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో టీమిండియా క్రికెటర్లు వీళ్లే

Icc

Icc

ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అందులో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం కోల్పోయాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. యశస్వి ఒక్క స్థానం సాధించి ఏడో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ ఆరో స్థానానికి పడిపోయాడు.

HD Deve Gowda: జమ్మూలో పర్యటించిన మాజీ పీఎం.. నాటి మదురస్మృతులను గుర్తు చేసుకున్న దేవేగౌడ!

అనుభవజ్ఞుడైన జో రూట్ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 56, 32 పరుగులతో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, రోహిత్‌ శర్మలను అధిగమించాడు. బాబర్ ఆరు స్థానాలు కోల్పోయి.. మూడో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. బంగ్లాదేశ్‌తో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో అతను విఫలమయ్యాడు. పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ తొలి టెస్టులో సెంచరీ చేసి ఏడు స్థానాలు ఎగబాకి ఉమ్మడి 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇది అతని కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్. బంగ్లాదేశ్‌కు చెందిన ముష్ఫికర్ రహీమ్ కూడా ఏడు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Kolkata Doctor Murder : కోల్‌కతా అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్.. మరణ ధృవీకరణ పత్రంలో సమయం మార్పు!

బౌలర్లలో అశ్విన్ అగ్రస్థానంలో
భారత అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా వరుసగా మూడు, ఏడో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కు చేరుకోగా.. శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ అసిత ఫెర్నాండో 10 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌లో నిలిచాడు. పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నసీమ్‌ షా నాలుగు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు గుస్‌ అట్కిన్‌సన్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 42వ ర్యాంక్‌కు చేరుకుని కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్‌ను సాధించారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. అక్షర్ పటేల్ ఆరో స్థానంలో ఉన్నారు.