NTV Telugu Site icon

ICC Test Rankings: రెండో స్థానంలో అశ్విన్‌, టాప్-10లోకి జడేజా.. ఆల్‌రౌండర్లుగానూ..

Icc Test Rankings

Icc Test Rankings

ICC Test Rankings: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తాజా టెస్ట్​ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి దూసుకెళ్లాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో రెండు టెస్టుల నుంచి 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్ ర్యాంకింగ్స్‌లో జడేజా తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాలతో టాప్-10లో జడేజా మూడో భారత ఆటగాడు. 2019 సెప్టెంబర్ తర్వాత జడేజా మళ్లీ తొలి పది స్థానాల్లోకి రావడం ఇదే తొలిసారి. బౌలర్ల విభాగంలో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 864 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇప్పటివరకు 158 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా రెండో స్థానంలో ఉన్న భారత ఆల్-రౌండర్ అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్‌-5లోకి దూసుకెళ్లాడు. తాజా టెస్ట్ ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఓవరాల్‌గా రెండు స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకున్నాడు. జడేజా 460 రేటింగ్ పాయింట్లతో టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంకా ఈ జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 96 పరుగులు చేయడం ద్వారా ఎడమ చేతి బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా బ్యాట్‌తో కూడా సహకరించాడు. 376 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక కొంతకాలం నుంచి అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లాండ్​ సీమర్ జేమ్స్ ఆండర్సన్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

Read Also: Zomato: కొత్త సర్వీస్‌కు జొమాటో శ్రీకారం..

బ్యాటర్ల విభాగంలో ఆస్ట్రేలియా ప్లేయర్​ మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), బాబర్ ఆజం(పాకిస్థాన్ కెప్టెన్​) నిలిచారు. టీమిండియా బ్యాటర్లు రిషబ్​ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ 6, 7వ స్థానాల్లో కొనసాగుతున్నారు.