ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!

India Vs Japan Historic T20 Clash

India Vs Japan Historic T20 Clash

ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఇంగ్లండ్ రూపంలో తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా భారత జట్టు అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగింది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్లు రెండూ సమానంగా 269 రేటింగ్ పాయింట్లతో ఉన్నాయి. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఒకవేళ చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ విజయం సాధిస్తే, పాయింట్ల పరంగా స్వల్ప ఆధిక్యతను సంపాదించి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

ఈ తాజా ర్యాంకింగ్స్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలవగా, ఆస్ట్రేలియా 260 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 247 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, 243 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ 240 పాయింట్లతో ఆరో స్థానంలో, వెస్టిండీస్ 234 పాయింట్లతో ఏడో స్థానంలో, బంగ్లాదేశ్ 224 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఇక 220 పాయింట్లు ఉన్న శ్రీలంక తొమ్మిదో స్థానంలో, అదే పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ పదో స్థానంలో నిలిచాయి. ఇంగ్లండ్ తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే నంబర్ వన్ పీఠం మారుతుంది, లేదంటే భారతే అగ్రస్థానంలో కొనసాగుతుంది.