NTV Telugu Site icon

Champions Trophy: బీసీసీఐ అభ్యంతరం.. ఛాంపియన్స్ ట్రోపీ టూర్ షెడ్యూల్ మార్పు

Icc

Icc

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది. ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిర్వహించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. గ్లోబల్ బాడీ ఆఫ్ క్రికెట్ పీఓకేను చేర్చని సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ట్రోఫీ టూర్ ఇప్పుడు కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంక్వాలో జరుగనుంది. తాజాగా.. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ తన ‘గ్లోబల్ ట్రోఫీ టూర్’ని శనివారం ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో టూర్‌ ప్రారంభం కానుందని ఐసీసీ పేర్కొంది.

Read Also: IPL Auction 2025: ఈసారి మెగా వేలంలో నిలిచిన పిన్న వయస్కుడైన ఆటగాడు ఇతనే..!

ట్రోఫీ టూర్ పాకిస్తాన్ రాజధాని నవంబర్ 16న ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానుంది. నవంబర్ 17న తక్షిలా, ఖాన్‌పూర్.. నవంబర్ 18న అబోటాబాద్, నవంబర్ 19న ముర్రే, నవంబర్ 20న నథియా గలీ, నవంబర్ 22 నుండి 25న కరాచీలో ముగుస్తుంది. అంతకుముందు.. నవంబర్ 14న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్కర్డు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్ వంటి నగరాలలో ట్రోఫీ నిర్వహిస్తుందని ప్రకటించింది. కాగా.. భద్రతా సమస్యలపై టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదన్న సంగతి తెలిసిందే..

Read Also: Crime: రోడ్డు పక్కన సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం..

ట్రోఫీ టూర్ యొక్క ముఖ్య తేదీలు:
16 నవంబర్ – ఇస్లామాబాద్, పాకిస్తాన్
17 నవంబర్ – తక్షిలా మరియు ఖాన్పూర్, పాకిస్తాన్
18 నవంబర్ – అబోటాబాద్, పాకిస్తాన్
19 నవంబర్- ముర్రే, పాకిస్తాన్
20 నవంబర్- నథియా గాలి, పాకిస్థాన్
22 – 25 నవంబర్ – కరాచీ, పాకిస్తాన్
26 – 28 నవంబర్ – ఆఫ్ఘనిస్తాన్
10 – 13 డిసెంబర్ – బంగ్లాదేశ్
15 – 22 డిసెంబర్ – దక్షిణాఫ్రికా
25 డిసెంబర్ – 5 జనవరి – ఆస్ట్రేలియా
6 – 11 జనవరి – న్యూజిలాండ్
12 – 14 జనవరి – ఇంగ్లండ్
15 – 26 జనవరి – భారతదేశం
27 జనవరి – ఈవెంట్ ప్రారంభం- పాకిస్తాన్

Show comments