NTV Telugu Site icon

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. ‘స్పెషల్-20’లోకి దిగ్గజ బ్యాట్స్‌మెన్

Joe Root

Joe Root

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జో రూట్.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ‘స్పెషల్-20’ క్లబ్‌లోకి చేరాడు. ఈ జాబితాలో ఇప్పటికే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో 20 మంది మెన్ బ్యాట్స్‌మెన్ సాధించిన కెరీర్ బెస్ట్ టెస్ట్ రేటింగ్‌ల జాబితాలో రూట్ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం జో రూట్ 932 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్నాడు. రూట్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ టెస్ట్ రేటింగ్. కోహ్లీ 15వ స్థానంలో ఉండగా.. 937 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా గ్రేట్ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ 961 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ తాజా ర్యాంకింగ్స్‌లో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. ముల్తాన్‌లో 375 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 262 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రూట్ టెస్టు కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. డబుల్ సెంచరీ చేసిన తర్వాత రేటింగ్ పాయింట్లు పెరిగాయి. అంతకుముందు.. 923 పాయింట్లు ఉండేది. తాజా ర్యాంకింగ్స్‌లో రూట్ 100 పాయింట్లకు పైగా చేరాయి. న్యూజిలాండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ 829 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ కూడా 829 పాయింట్లతో ఉన్నాడు. ముల్తాన్‌లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీ (317) సాధించి 11 స్థానాలు ఎగబాకాడు. కోహ్లీ (724 పాయింట్లు) ఏడో స్థానంలో ఉన్నాడు.

Read Also: Hoax bomb threat: విమానాల్లో స్కై మార్షల్స్ సంఖ్య పెంపు.. నకిలీ బాంబు బెదిరింపులపై కీలక నిర్ణయం..!

20 మంది పురుష బ్యాట్స్‌మెన్ కెరీర్‌లో అత్యుత్తమ టెస్ట్ రేటింగ్‌లు
961- డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా)
947- స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
945- లెన్ హట్టన్ (ఇంగ్లండ్)
942- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
942- జాక్ హాబ్స్ (ఇంగ్లండ్)
941- పీటర్ మే (ఇంగ్లండ్)
938- గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)
938- వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)
938- క్లైడ్ వాల్కాట్ (వెస్టిండీస్)
938- కుమార్ సంగక్కర (శ్రీలంక)
937- మార్నస్ లాబుస్చాగ్నే (ఆస్ట్రేలియా)
937- విరాట్ కోహ్లీ (ఇండియా)
935- జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)
935- ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
935- మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా)
933- మహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్)
932- జో రూట్ (ఇంగ్లండ్)