అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకుల్లో భారత్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన నంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నాడు. అంతేకాదు తన కెరీర్‌లో బెస్ట్ రేటింగ్ (907) పాయింట్లను సాధించాడు. ఆసియా కప్ 2025 చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమన్‌పై 38 పరుగులు, సూపర్-4లోపాకిస్థాన్‌పై 74 పరుగులు చేసిన అభిషేక్.. తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకున్నాడు. రెండో స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (844) ఉన్నాడు. తిలక్ వర్మ (791) మూడో స్థానంలో.. సూర్యకుమార్ యాదవ్ (729) ఆరో స్థానంలో ఉన్నారు.
Also Read: KTR: బీజేపీ మోసం రాముడికి కూడా అర్థమైంది.. కరీంనగర్ ప్రజలు మాత్రం..!
బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి టాప్ లేపాడు. ఆసియా కప్ 2025 రాణిస్తున్న చక్రవర్తి 14 పాయింట్లను పెంచుకుని 747 రేటింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకున్నాడు. జాకబ్ డఫీ (717), అకేల్ హోసిన్ (707), అబ్రార్ అహ్మద్ (703), ఆడమ్ జాంపా (700) టాప్ 5లో ఉన్నారు. అబ్రార్ ఏకంగా 12 స్థానాలను ఎగబాకి నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా (238) తన టాప్ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మహమ్మద్ నబీ (231), సికందర్ రాజా (212) టాప్ 3లో ఉన్నారు. టీ20 ఫార్మాట్‌లోని మూడు విభాగాల్లో టీమిండియా ప్లేయర్స్ ఉన్నారు. ఆటగాళ్లు మాత్రమే కాదు టీమ్ ర్యాంకుల్లో కూడా భారత్ టాప్‌లో ఉంది.
