NTV Telugu Site icon

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో తిలక్ వర్మ వద్దు.. ధావన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Shikhar Dhawan

Shikhar Dhawan

Shikhar Dhawan Picks His No. 4 For 2023 ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023కి సమయం దగ్గరపడుతోంది. భారత్‌ వేదికగా అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌ల కోసం అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రణాళికలు, కసరత్తులు మొదలెట్టాయి. భారత్ కూడా ప్రపంచకప్‌ లక్ష్యంగా జట్టుని సిద్ధం చేస్తోంది. అయితే మిడిలార్డర్‌లో కీలకం అయిన నాలుగో స్థానంపై అనిశ్చితి నెలకొంది. యువరాజ్ సింగ్‌ రిటైర్‌ అయిన తర్వాత ఆ స్థానంలో ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. గత ప్రపంచకప్‌లో కూడా ఇదే సమస్య కారణంగా భారత్ సెమీస్ నుంచి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

ఎందరో ఆటగాళ్ల అనంతరం చివరకు శ్రేయస్‌ అయ్యర్ నాలుగో స్థానం లోటును భర్తీ చేశాడు. అయితే గాయం కారణంగా అతడు గత కొన్ని నెలలుగా భారత జట్టుకు అందుబాటులో లేడు. అయ్యర్‌ జట్టుకు దూరమైన నేపథ్యంలో భారత్ మేనేజ్మెంట్ వేర్వేరు ఆటగాళ్లతో ప్రయోగాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొలనడంతో.. రేసులో టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు. సంజు శాంసన్ సహా యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా నాలుగో నంబర్‌కు పోటీ దారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: IND Playing 11 vs WI: గిల్‌పై వేటు.. ఓపెనర్‌గా యువ ఆటగాడు! నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే

ప్రపంచకప్‌ 2023లో నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆడించాలని శిఖర్‌ ధావన్‌ సూచించాడు. ‘నాలుగో స్థానంకు నేను సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంచుకుంటాను. ఎందుకంటే గత కొంతకాలంగా సూర్య అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడు. అతడు అనుభవజ్ఞుడు కూడా. ఐపీఎల్, భారత్ తరఫున మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ అనుభవం ఉపయోగపడుతుంది. నా ఛాయిస్‌ సూర్యకుమారే’ అని గబ్బర్ అన్నాడు. యువ సంచలనం తిలక్‌ వర్మ నాలుగో స్థానంలో మెరుగ్గా ఆడుతున్నా.. అనుభవం పేరిట సూర్య పేరును ధావన్ ఎంచుకోవడం విశేషం. చూడాలి మరి భారత మేనేజ్మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికి ఓటేస్తారో.