NTV Telugu Site icon

Australia vs Sri Lanka: టాస్ గెలిచిన శ్రీలంక.. ఈసారైనా ఆస్ట్రేలియా 200 స్కోర్ చేస్తుందా?

Australia Vs Sri Lanka

Australia Vs Sri Lanka

AUS vs SL 14th Match Playing 11 Out: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మరికొద్దిసేపట్లో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుసాల్ మెండిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాసున్ శనక, మతీషా పతిరాణా స్థానాల్లో చమిక మరియు లహిరు కుమార ఆడుతున్నారని తెలిపాడు. మరోవైపు తాము తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ చెప్పాడు.

ఈ ఎడిషన్‌లోని తొలి రెండు మ్యాచ్‌లలో ఆసీస్ 200 స్కోర్ మార్క్ కూడా అందుకోలేదు. భారత్‌ స్పిన్‌ దెబ్బకు 199కే ఆలౌటైన ఆసీస్.. సఫారీ పేస్‌ దాటికి 177 పరుగులకే కుప్పకూలింది. దాంతో శ్రీలంకపై అయినా డబుల్ సెంచరీ మార్క్ అందుకుంటుందేమో చూడాలి. ఈ విజయం ఆస్ట్రేలియాకు చాలా అవసరం. మరోవైపు శ్రీలంక పరిస్థితి అంతంతగానే ఉంది. ప్రపంచకప్‌ 2023లో లంక కూడా ఇంకా బోణి కొట్టలేదు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ చేతుల్లో ఓడిపోయింది. నేడు ఆస్ట్రేలియాపై గెలవాలని చూస్తోంది.

తుది జట్లు:
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక.

Show comments