iBOMMA Ravi bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ ఆ కండిషన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iBOMMA Ravi bail: టాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలను వణికించిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ వ్యవస్థాపకుడు రవికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ సాధారణంగా కాకుండా అత్యంత కఠినమైన నిబంధనలతో కూడి ఉండటం గమనార్హం. గత కొంతకాలంగా సాగుతున్న విచారణ అనంతరం, ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ మంజూరు చేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కోర్టు పలు ఆంక్షలు విధించింది.
READ ALSO: Gautam Gambhir: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2026లో గంభీర్ కొత్త టీమ్‌కి మారబోతున్నాడా?
Also Read
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
- Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
ప్రధానంగా రవి ఇంటర్నెట్ వినియోగంపై కోర్టు పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది. ఆయన ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే కేవలం పోలీసుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీనితో పాటు నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేస్తూ, ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. భద్రతా చర్యల్లో భాగంగా రవి తన పాస్‌పోర్ట్‌ను వెంటనే కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే వాటిని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టాన్ని చేకూర్చారనే ఆరోపణలపై రవి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున, ఆయన మళ్లీ వెబ్‌సైట్ నిర్వహణ లేదా పైరసీ పనులు చేపట్టకుండా ఉండేందుకే కోర్టు ఇంటర్నెట్‌పై ఇటువంటి అరుదైన , కఠినమైన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్‌డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!