Site icon NTV Telugu

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్ ఇవ్వనున్న సైబర్ క్రైమ్ పోలీసులు..

Ibomma Ravi

Ibomma Ravi

iBomma Ravi: ఐ బొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు.. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో రవిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు. పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. మరోవైపు రెండో రోజు ఐ బొమ్మ రవి విచారణ కొనసాగుతోంది. రవి సాంకేతిక పరిజ్ఞానంపై ఆరా తీస్తున్నారు. ఎంబీఏ చదివి టేక్‌గా ఎలా మారాడనే దానిపై విచారణ చేస్తున్నారు.. రవికి టెక్నాలజీ సపోర్ట్ చేసిన వారి వివరాలని తెలుసుకుంటున్నారు.

READ MORE: Smriti Mandhana: పలాష్ ముచ్చల్‌ మామూలోడు కాదుగా.. సినిమాటిక్ స్టైల్ లో లవ్ ప్రపోజల్..!

మరోవైపు.. ఐ-బొమ్మ అనే పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. స్వయంగా అతని చేతనే పోలీసులు ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయించారు. అయితే, ఇప్పుడు తెరమీదకు కొత్తగా ఐ-బొమ్మ వన్ అనే ఒక వెబ్‌సైట్ వచ్చింది. ఐ-బొమ్మ కోసం వెతుకుతున్న వారికి ఈ ఐ-బొమ్మ వన్ ఇప్పుడు దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్ ఎవరిది అనే చర్చ నడుస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో ఏదైనా సినిమా చూడాలని ప్రయత్నించి లింక్ మీద క్లిక్ చేయగా, అది మూవీ రూల్స్ (Movie Rulz) వెబ్‌సైట్‌కి రీ-డైరెక్ట్ అవుతోంది. ఐ-బొమ్మ లాగానే మూవీ రూల్స్ వెబ్‌సైట్ కూడా చాలా కాలం నుంచి నడుస్తోంది. ఈ సైట్ ఏకంగా సినిమాల హెచ్‌డీ ప్రింట్‌తో పాటు, అప్పుడే రిలీజ్ అయిన సినిమాల థియేటర్ ప్రింట్‌లను సైతం అప్‌లోడ్ చేస్తూ వస్తోంది.

READ MORE: Korean Minister : ఇఫ్ఫీ స్టేజ్‌పై ‘వందేమాతరం’ పాడిన కొరియన్ మినిస్టర్ – సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Exit mobile version