Ibomma Ravi: ఐబొమ్మ రవి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో అతడి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం మూడు సంవత్సరాల్లోనే ఐబొమ్మ రవి సుమారు రూ.13 కోట్ల ఆదాయం సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తంలో దాదాపు రూ.10 కోట్లు విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైఫై పబ్‌లు, 5 స్టార్ హోటళ్లలోనే బస చేస్తూ లగ్జరీ లైఫ్ గడిపినట్టు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం రవి అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.
PAN–Aadhaar Linking Deadline: పాన్ – ఆధార్ లింక్ గడువును మరోసారి పొడిగిస్తారా..?
పోలీసుల వివరాల ప్రకారం.. 2007 నుంచే ఐబొమ్మ రవికి పైరసీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి తన స్నేహితుల సర్టిఫికెట్లు చోరీ చేస్తూ అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రవి తన స్నేహితులైన ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్ల ఐడెంటిటీ ప్రూఫ్‌లను వారి తెలియకుండానే దొంగిలించాడు. ఆ డాక్యుమెంట్లపై తన ఫోటో అమర్చుకుని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
Free Rides For Drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. మద్యం సేవించినవారికి ఉచిత రవాణా సేవలు..!
ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా ఐబొమ్మ రవి మొత్తం మూడు కంపెనీలు స్థాపించినట్లు పోలీసులు వెల్లడించారు. Supplier India, Hospital Inn, ER Infotech పేర్లతో మూడు కంపెనీలను సృష్టించాడు. అయితే ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న రామగుండంకు చెందిన అంజయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. విచారణలో భాగంగా రవి, టెలిగ్రామ్ నుంచి ‘తండెల్’, ‘కిష్కిందపురి’ సినిమాలను తీసుకున్నట్టు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.