Site icon NTV Telugu

I Bomma Owner Arrested: సంచలనం.. పోలీసులకే సవాల్ విసిరిన “ఐ బొమ్మ” నిర్వాహకుడు అరెస్ట్..

I Bomma

I Bomma

iBomma Operator Ravi Arrested: పోలీసులకే ఛాలెంజ్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇమ్మడి రవి.. కరేబియన్ దీవుల్లో ఉంటూ i-Bomma వెబ్ సైట్ నిర్వహిస్తున్నాడు. వెబ్ సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ, OTT కంటెంట్‌తో నింపేశాడు. ఐ-బొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు ఫిర్యాదు చేశారు. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. గత ఆరు నెలలుగా ఐ బొమ్మ నిర్వాకుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి… భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. పోలీసులు అకౌంట్లో ఉన్న రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. సినీ పరిశ్రమకు రూ. 3000 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చాడు రవి..

READ MORE: Kaantha : ‘కాంత’కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చింది : రానా దగ్గుబాటి

సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలితో అభిమానులకు ఐబొమ్మ (బప్పం) అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తగ్గడానికి కూడా పైరసీ సైట్ ఐబొమ్మనే కారణం. మొన్నటివరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ వచ్చిన ఐబొమ్మ.. కొద్ది రోజుల నుంచి టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల థియేటర్ హెచ్‌డీ ప్రింట్‌ను సైతం పైరసీ చేసి రిలీజ్ చేస్తోంది.

 

Exit mobile version