NTV Telugu Site icon

IAS Officers : తెలంగాణాలోనే ఉంటాం.. కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

Amrapali

Amrapali

కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్ ను పలువరు ఐఏఎస్‌లు ఆశ్రయించారు. క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన అందులో ఉన్నారు. డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్‌లు పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కోరారు. ఈ నలుగురు ఐఏఎస్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ రేపు ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.

READ MORE: IPL 2025-MI: ముంబై జట్టులో భారీ మార్పులు ఖాయం.. హార్దిక్‌, రోహిత్ సహా..: ఆకాశ్

అయితే ఇటీవల తెలంగాణ కేడర్ కావాలని విజ్ఞప్తి చేసిన 11మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం నో చెప్పింది. ఈ 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలోనే రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీఓపీటీ (DOPT) ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తనకు తెలంగాణ కేడర్ కావాలని కోరింది. దీనిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్ ను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ కూడా ఇదే ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్‌లు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. 2014 ఏపీ విభజన తర్వాత.. తెలంగాణ కేడర్ కావాలని కేంద్రాన్ని 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలిండియా సర్వీసెస్ అధికారుల మార్పులను చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడిచిన 10 సంవత్సరాలలో డీఓపీటీకి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటేషన్ మీద పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పని చేస్తున్న 11 మంది ఐఏఎస్‌లు తక్షణమై రిలీవ్ అయి ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఢిల్లీలో జరిగిన డీఓపీటీ సమావేశానికి వీరంతా హాజరయ్యారు. ఆ సమావేశంలో సొంత రాష్ట్రాలకు వెళ్లలేమని పిటిషన్ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఆ పిటిషన్ క్యాన్సిల్ అయింది. సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు ప్రస్తుతం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు.