Pakistan : ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. పశ్చాత్తాపంలో పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : ముజాహిదీన్‌లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐకమత్యం కీలకమని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ఇంటిని చక్కదిద్దుకోవడం చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2010 నుంచి 2017 మధ్య పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం పెషావర్ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా మరణించిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మసీదు సెంట్రల్ హాల్లో ప్రార్ధనలు జరుగుతుండగా తాలిబన్‌లు ఆత్మాహుతి దాడికి పాల్పడటాన్ని ఆయన హేయమైన చర్యగా పేర్కొన్నారు.
Read Also: Shocking Incident : ఛీ వీళ్లు పేరెంట్సా.. బిడ్డకు విమాన టిక్కెట్ కొనాల్సి వస్తుందని..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
మసీదులో ప్రార్థనల్లో మునిగి ఉన్న వాళ్లను హతమార్చిన ఘటనలు భారత్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఎన్నడూ చోటుచేసుకోలేదని, కానీ ఇప్పుడు పాకిస్థాన్‌లో అలాంటి ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు సుమారు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించిందని వాపోయారు. మసీదులో ఆత్మాహుతి దాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్‌లో నిరసన ప్రదర్శన జరిపారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 101 మంది మరణించారు. వారిలో 97 మంది పోలీసులే. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీం మునీర్ సోమవారం పెషావర్ వెళ్లి పేలుడు స్థలాన్ని పరిశీలించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!