విపక్ష ఇండియా కూటమి జూన్ 1వ తేదీన ఢిల్లీలో సమావేశం కాబోతుంది. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా కూటమిలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే సమాచారం ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలకు దూరంగా ఉన్నారు. ఆ రెండు పార్టీలపై విమర్శలు కూడా చేశారు. దీంతో ఇండియా కూటమి మీటింగ్ కు ఆమె వెళ్తారా ? లేదా ? అనే దానిపై నెలకొన్న సస్పెన్స్‌కు దీదీ తెరదించింది.
Read Also: Hyderabad Power Cut: నేడు నగరంలో పవర్ కట్.. ప్రాంతాల వారీగా షెడ్యూల్..
జూన్ 1వ తేదీన ఇండియా కూటమి నిర్వహిస్తున్న సమావేశానికి తాను రావడం లేదని బెంగాల్ సీఎం మమత బెనర్జీ తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తుది విడత ఘట్టంలో బిజీగా ఉండటంతో పాటు రెమాల్ తుఫాన్ ప్రభావం బెంగాల్ లో ఎక్కువగా ఉండటం వల్లే రాష్ట్రం వదిలి వచ్చే పరిస్థితి లేదని దీదీ స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల ఫలితాలు వచ్చాక బయటి నుంచి ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తానని గతంలోనే సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే, జూన్ 1న విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.