Site icon NTV Telugu

PM Narendra Modi: ‘నేను ఈ గుజరాత్‌ని తయారు చేశాను’.. బీజేపీ ఎన్నికల నినాదాన్ని ప్రారంభించిన ప్రధాని

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ కొత్త ఎన్నికల నినాదాన్ని గుజరాతీలో ప్రారంభించారు. ‘నేను ఈ గుజరాత్‌ని తయారు చేశాను’ అంటూ ఎన్నికల నినాదాన్ని ప్రారంభించారు. ప్రతి గుజరాతీ ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటాడని, అందుకే ప్రతీ వ్యక్తి గుజరాతీ మాట్లాడతాడన్నారు. ‘నేను ఈ గుజరాత్‌ను తయారు చేశాను’ అని కప్రాడాలో జరిగిన బహిరంగ సభలో ఆయన అన్నారు. “ఆ గుజరాత్ మై బనవ్యు ఛే” (నేను ఈ గుజరాత్‌ని తయారుచేశాను) అని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే తన 25 నిమిషాల నిడివి ప్రసంగంలో ప్రేక్షకులను అనేకసార్లు జపించేలా చేశారు.

కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పకుండానే ఆయన ఆ పార్టీపై మాటల దాడి చేశారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తూ గడిపిన విభజన శక్తులు గుజరాత్‌లో తుడిచిపెట్టుకుపోతాయని ప్రధాని అన్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన కప్రదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రధాని తన గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గిరిజన సమాజం తనకు ఎంత ముఖ్యమో, వారి కోసం తమ పార్టీ ఏం చేసిందో నొక్కి చెప్పడం ద్వారా ఆదివాసీ సమాజానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని సొంత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ సాయంత్రం తర్వాత భావ్‌నగర్‌లో జరిగే సామూహిక వివాహ వేడుక ‘పాపా నీ పరి’ లగ్నోత్సవ్ 2022’లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ వేడుకలో తండ్రులు లేని 522 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు జరగనున్నాయి.

Monkeys To Space: అంతరిక్షంలోకి కోతులు.. పునరుత్పత్తిపై కీలక ప్రయోగం!

అక్టోబర్ 13న అహ్మదాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా “గుజరాత్ గౌరవ్ యాత్ర”ను ప్రారంభించిన తర్వాత గుజరాత్‌లో బీజేపీ తన ప్రచారాన్ని తీవ్రం చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మెహసానాలో ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. అంతకుముందు అక్టోబర్ 12న రాజ్‌కోట్ జిల్లాలోని జమ్‌కందోర్నాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ర్యాలీ అనంతరం ఆయన రోడ్‌షో కూడా నిర్వహించారు. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

గుజరాత్‌లో వరుసగా ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ప్రచారానికి మరింత సమయం ఇచ్చేందుకు అభ్యర్థులపై ముందస్తు నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ఆసక్తిగా ఉంది. యాత్రల ద్వారా తన ప్రచారాన్ని ఉద్ధృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ ఎన్నికలు తమకు, బీజేపీకి మధ్య ప్రత్యక్ష పోరు అని పేర్కొంది.

Exit mobile version