Site icon NTV Telugu

Kejriwal: జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదంటే..?

Kejriwal

Kejriwal

Lokshabha Elections 2024: ఢిల్లీ మద్యం కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయకపోవడంపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు అనేక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు పంపించారని పేర్కొన్నారు. ఆ విషయం అర్థమైంది కాబట్టే తాను సీఎం పదవికి రిజైన్ చేయలేదన్నారు. తాను అరెస్టైన నాటి నుంచి బీజేపీ నేతలు తన రాజీనామాకు డిమాండ్ చేసిన విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేశారు.

Read Also: Betting: బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కొడుకు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి

అయితే, ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు నాకు.. కానీ, పదవి నుంచి దింపేయడానికి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిచండం చూసి వారి కుట్రలు సాగనివ్వొద్దనే ఉద్దశంతోనే సీఎం పదవికి రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజంగానే అవినీతిపై పోరాడాలనుకుంటే తనను చూసి నేర్చుకోవాలన్నారు. మా మంత్రులతో సహా అవినీతి నాయకులను మేం జైలుకు పంపించామని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా అణగదొక్కాలో తెలియక పార్టీ కీలక నేతలైన నలుగురిని ప్రధాని మోడీ జైలుకు పంపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ పై విసరడానికి రాళ్లు మిగలక పోవడంతో అగ్ర శ్రేణి నాయకులను టార్గెట్ చేసి జైలుకు పంపి మా పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. అయితే, ఆమ్ ఆద్మీ కేవలం పార్టీ కాదని, ఒక ఐడియాలజీ అంటూ వివరించారు. ఆప్ ను ఎంత అణచివేయాలని ఆలోచిస్తే అంతకంటే పైకి ఎదుగుతుందని ఢిల్లీ సీఎం చెప్పారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాను జైలు నుంచి బయటకు వస్తానని ఎవరూ ఊహించలేదు.. మీ అందరి ప్రార్థనల ఫలితంగానే తనకు బెయిల్ వచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Exit mobile version