Site icon NTV Telugu

Sanjay Raut: వారిని చెత్త అని పిలుస్తా.. షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్సీపై సంజయ్ రౌత్ ఆగ్రహం

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: శాసన మండలి సభ్యురాలు (MLC) మనీషా కయాండే ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మనీషాను ఎగతాళి చేస్తూ, సంజయ్ రౌత్ ఆమెను చెత్త అని పిలిచారు. మీడియాతో మాట్లాడుతూ.. “అది వదిలేయండి.. దీనివల్ల ఏం తేడా రాదు.. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎక్కడికెళ్లిందో నాకు తెలియదు.. ఆమెను పార్టీలోకి ఎవరు తీసుకొచ్చారో.. ఎవరో నాకు తెలియదు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలాంటి వ్యక్తులు వస్తుంటారు, పోతారు. వారిని నేను చెత్త అని పిలుస్తాను. గాలి వీస్తే చెత్త ఎగిరిపోతుంది. అలాంటి వారిని మేం నమ్మం. నేను పార్టీకి నమ్మకమైన సైనికుడిని. ఇలా వచ్చి వెళ్ళేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో నేను పెద్దగా రిలేషన్ షిప్ పెట్టుకోను. ” అని సంజయ్ రౌత్ అన్నారు.

Also Read: New RAW Chief: ‘రా’ అధిపతిగా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియామకం

మహారాష్ట్రలో జరగనున్న బీఎంసీ ఎన్నికలకు ముందు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి సభ్యురాలు మనీషా కయాండే ఏకనాథ్ షిండే వర్గంలో చేరారు. గత కొన్ని రోజులుగా మనీషా కయాండే ఠాక్రే వర్గం పట్ల అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. జూన్ 18న ఆమె ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.

శివసేనలో చేరిన తర్వాత మనీషా కయాండే మాట్లాడుతూ.. ” ఈరోజు నాకు చాలా గౌరవప్రదమైన రోజు. అసలు శివసేన అనే పార్టీలో చేరుతున్నాను. పార్టీ వైఖరిని గట్టిగానే చెప్పాను. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఏడాదిలోపే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పనిలో పనిగా స్పందించారు. బాలాసాహెబ్ శివసేన ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను.” అని అన్నారు.

Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు.. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు ఇస్రో సన్నద్ధం..!

మనీషా కయాండే ఎవరు?
మనీషా కయాండే థాకరే వర్గానికి చెందిన శాసనమండలి సభ్యురాలు (MLC). 2009లో బీజేపీ నుంచి సియోన్ కోలివాడ నుంచి పోటీ చేశారు. 2012లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేనలో చేరారు. 2018లో ఠాక్రే ఆయనను శాసన మండలి సభ్యురాలిగా చేశారు.

Exit mobile version