Pawan Kalyan: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం రావడం తాను చేసుకున్న అదృష్టమని.. దశాబ్ద కాలంగా మీ భవిషత్తు కోసం నిలబడ్డానని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ నాయకులు మాటలు విని కూడా మన వారికి సిగ్గు రాలేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే ఎవరో కొట్టేశారని అన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ లాల్చికి బదులుగా కలర్ మార్చాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం చివరికి చెప్పులు కొట్టేసే స్థాయికి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Harish Rao : దేశంలో మూడు రకాల చెత్తను వేరు చేసే ఒకే ఒక్క పట్టణం సిద్దిపేట
హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని పిచ్చి వాళ్ళను చేశారని.. ఈ చచ్చు ప్రభుత్వం హిందు దేవాలయాలపై దాడిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాకినాడ ఎమ్మెల్యే లాగా తాను రోజుకి రెండు కోట్ల మట్టిని తోలనని ఆరోపించారు. ఎంపీ కొడుకును, భార్యను కిడ్నాప్ చేస్తే ఏమి చేశారని పవన్ ప్రశ్నించారు. క్రిమినల్స్‌ను వెనుక వేసుకుని వస్తారని ఆరోపణలు చేశారు. అమ్మ వారి సాక్షిగా ఆంధ్రని విడిచి వెళ్లనంటూ పవన్ ప్రతిజ్ఞ చేశారు. గూండా గాళ్ల కాళ్ళు, కీళ్లు విరగ గొడతానన్నారు. తిరుపతిని దోపిడీ చేస్తున్నారు..ఏడు కొండలతో ఆటలు ఆడితే నామ రూపాలు లేకుండా పోతారని పవన్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే పిఠాపురంని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతామన్నారు. హిందు దేవాలయాల మీద ఈ ప్రభుత్వం కన్ను వేసిందని.. తిరుపతి శ్రీ వాణి ట్రస్ట్‌లో దోపిడీ జరుగుతోందని పవన్ ఆరోపించారు.
Also Read: Bombay Highcourt: హిజ్రాలకు ఆ పని చేసేందుకు అనుమతి ఇవ్వలేం.. చట్టం తెస్తే తప్ప సాధ్యం కాదు
వ్యవసాయ శాఖ మంత్రి తనకు ఎన్ని రకాలు ధాన్యాలు ఉన్నాయో తెలుసా అంటున్నారని.. పుట్టగానే అందరికి అన్నీ తెలుస్తాయా అంటూ పవన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ భగవంతుడికే భయపడతాడన్నారు. మన కులపోడు అని కాదు.. సరైనోడా కాదా అని చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనకు అధికారం ఇవ్వాలంటూ ప్రజలను పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. తాను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాను గెలవడానికి ఏ వ్యూహం అయినా వేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
పిచ్చి వాగుడు వాగితే బయటకు తీసుకు వచ్చి కొడతానని.. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత గూండాలకు నరకం చూపిస్తానన్నారు. 2019 లో ఈ విషయం స్పష్టంగా చెప్పలేకపోయానని పవన్ గుర్తు చేశారు. అమిత్ షా దగ్గర కాకినాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుల రిపోర్ట్ ఉందని.. అందుకే వైజాగ్‌లో అమిత్ షా మాట్లాడారన్నారు. నా ప్రాణానికి రక్షణ అవసరం లేదని రివాల్వర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చేశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామ సచివాలయంలో ఆడపిల్లలను ఏడిపిస్తున్నారు.. ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి తాట తీస్తానన్నారు పవన్ కళ్యాణ్.