NTV Telugu Site icon

Shaheen Afridi: టీ20 జట్టుకు కెప్టెన్‌ అయినందుకు సంతోషిస్తున్నా..

Shaeen

Shaeen

ప్రపంచ కప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు బాబర్ తర్వాత.. టీ20 కెప్టెన్‌గా షాహీన్ షా ఆఫ్రిది నియమితులయ్యాడు. షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు.

Read Also: Shami: షమీ 7 వికెట్లు తీస్తాడని కలలో ముందే ఊహించా.. వైరల్ అవుతున్న ట్వీట్

టీ20 జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించిన తర్వాత షాహీన్ అఫ్రిదిలో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తుంది. కెప్టెన్ అయిన తర్వాత.. షాహీన్ అఫ్రిది ఒక ట్వీట్‌లో ఇలా వ్రాశాడు. “నేను జాతీయ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నందుకు గౌరవంగా, సంతోషిస్తున్నాను. నాపై విశ్వాసం చూపినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, అభిమానులకు ధన్యవాదాలు. జట్టు స్ఫూర్తిని కొనసాగించడానికి, క్రికెట్ మైదానంలో నా దేశానికి కీర్తిని తీసుకురావడానికి నేను నా వంతు కృషి చేస్తాను. అని తెలిపాడు. అంతేకాకుండా.. “మా విజయం ఐక్యత, నమ్మకం నిరంతర ప్రయత్నాలలో ఉంది. మాది కేవలం జట్టు మాత్రమే కాదు, మాది సోదరభావ కుటుంబం. కలిసి మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాము. ” అని షాహీన్ అఫ్రిది తెలిపాడు.

Read Also: Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఏమన్నాడంటే.. ?

2023 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత. పాకిస్థాన్ క్రికెట్‌లో చాలా కలకలం రేగింది. బాబర్ నేతృత్వంలోని పాకిస్థాన్ టోర్నీలో 9 లీగ్ మ్యాచ్‌లకు గాను నాలుగింటిలో మాత్రమే గెలవగలిగింది. మరోవైపు.. టోర్నీ నుంచి జట్టు నిష్క్రమించిన తర్వాత, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత మొత్తం సెలక్షన్ కమిటీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలగించింది. దీంతో బాబర్ ఆజం మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

Show comments