NTV Telugu Site icon

Hyundai Xeter: మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌.. ఫీచర్లు అదిరిపోయాయి..!

Hundai

Hundai

దక్షిణ కొరియా దేశానికి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్‌ మోటార్ ఇండియా.. సోమవారం తన కొత్త మోడల్ ‘Xeter’ని విడుదల చేసింది. భారత్‌లో అధికారికంగా లాంచ్‌ అయిన ఈ హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ బేస్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.5,99,900గా నిర్ణయించారు. ఇది హ్యుందాయ్‌ నుంచి వస్తున్న అతి చౌకైన ఎస్​యూవీగా గుర్తింపు తెచ్చుకుంది. Xter మోడల్ 1.2 లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Jawan: జవాన్ లో విజయ్.. ఇదుగో సాక్ష్యం..?

హ్యుందాయ్ Xeter ఒక లీటర్ పెట్రోల్‌తో 19.4 కిలోమీటర్లు పరిగెత్తుతుందని కంపెనీ పేర్కొంది. రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమై.. దాని అధిక వెర్షన్ ధరను రూ. 9.31 లక్షలుగా నిర్ణయించారు. అంతేకాకుండా ఆటోమేటిక్ వేరియంట్ మోడల్ ప్రారంభ ధర రూ. 7.96 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఒక లీటర్‌లో గరిష్టంగా 19.2 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. కంపెనీ ఈ మోడల్‌ను సిఎన్‌జి వెర్షన్‌లో కూడా విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 లక్షలు ఉండగా.. ఇది 27.1 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

Russia-Ukraine War: 500 రోజులుగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం..!

ఈ సందర్భంగా హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) ఉన్‌సూ కిమ్‌ మాట్లాడుతూ.. మార్కెట్‌లోకి క్సెటర్‌ను ప్రవేశపెట్టడంతో అన్ని కేటగిరీల్లో ఎస్‌యూవీ మోడళ్లను ప్రవేశపెట్టే కంపెనీగా హ్యుందాయ్ అవతరించిందన్నారు. ఈ మోడల్ అభివృద్ధికి రూ.950 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. భారత మార్కెట్ పట్ల హ్యుందాయ్ మోటార్‌కు ఉన్న నిబద్ధతను తెలియజేస్తూ, వచ్చే పదేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఇటీవలే ప్రకటించినట్లు కిమ్ తెలిపారు. తమిళనాడులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రారంభించడం మరియు బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు.

Chiranjeevi and Pawan Kalyan: చిరంజీవి, పవన్‌పై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. మెగాస్టార్‌ అప్పుడే చెప్పాడు..

ఈ కారు( Hyundai Exter ) డాష్‌ క్యామ్‌, ఫ్రంట్‌, బ్యాక్ కెమెరాలు, సింగల్‌ పాన్‌ సన్‌రూఫ్‌, ఆటోమేటిక్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, కీలెస్‌ ఎంట్రీ, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, ఇన్‌బిల్ట్‌ నావిగేషన్‌, ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, కనెక్టెడ్‌ కార్‌టెక్‌ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చింది. 6 ఎయిర్‌ బ్యాగ్స్‌తో పాటు ESC, అన్ని సీట్లకూ సీట్‌బెల్ట్‌ రిమైండర్, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, ABS, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్‌ వంటివి ఉన్నాయి. ఇక కారు ఇంటీరియర్‌ అంతా బ్యాక్‌ కలర్‌లో ఉంటుంది. కారులోని భాగాలన్నీ నలుగురంగులోనే ఉంటాయి. ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ అందుబాటులో ఉంటుంది.