కొత్త హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 2025లో మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడు, కంపెనీ కొత్త వేరియంట్, HX 5 ప్లస్‌ను విడుదల చేసింది. ఈ వేరియంట్ HX 5, HX 6 మీడియం రేంజ్ లో ఉంది. ఈ కొత్త వేరియంట్ సరసమైన ధరకు కొన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. హ్యుందాయ్ వెన్యూ HX 5 ప్లస్ పెట్రోల్ MT వేరియంట్ ధర రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HX 5 వేరియంట్ కంటే దాదాపు రూ.85,000 ఖరీదైనది. HX 6 కంటే రూ.43,000 తక్కువ.
Also Read:Tollywood : 2025 టాలీవుడ్ పెళ్లిళ్లు.. పెటాకులు.. చేసుకున్న జంటలు ఎవరంటే
HX 5 ప్లస్ వేరియంట్ మాత్రమే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇది 83 PS పవర్, 114 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే. ఈ ఇంజన్ సిటీ డ్రైవింగ్‌కు అనువుగా ఉంటుంది. మంచి మైలేజ్ ఇస్తుంది (సుమారు 18.5 kmpl ARAI క్లెయిమ్). HX 5 ప్లస్‌లో HX 6 వేరియంట్ నుంచి కొన్ని ముఖ్యమైన ఫీచర్లు అందించారు. ఈ ఫీచర్లు కారును మరింత ప్రీమియం, కన్వీనియంట్‌గా చేస్తాయి.
క్వాడ్ బీమ్ LED హెడ్‌ల్యాంప్స్
రూఫ్ రైల్స్
రియర్ వైపర్, వాషర్
రియర్ విండో సన్‌షేడ్స్
వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ విత్ స్టోరేజ్
డ్రైవర్ పవర్ విండో ఆటో అప్-డౌన్ విత్ సేఫ్టీ
Also Read:Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
హ్యుందాయ్ వెన్యూ రెండవ తరం మోడల్లో బోల్డ్ డిజైన్, పెద్ద సైజ్ (మునుపటి కంటే ఎత్తు, వెడల్పు పెరిగింది) ఉంది. ఇంటీరియర్‌లో డ్యూయల్ 12.3 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లేలు, బోస్ సౌండ్ సిస్టమ్ (హయ్యర్ వేరియంట్స్‌లో), వెంటిలేటెడ్ సీట్స్ వంటివి ఉన్నాయి. HX 5 ప్లస్ మిడ్-లెవల్ వేరియంట్‌గా మంచి బ్యాలెన్స్ ఆఫ్ ఫీచర్లు అందిస్తుంది. సేఫ్టీవెన్యూలో 33 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు (6 ఎయిర్‌బ్యాగ్స్ సహా), హయ్యర్ వేరియంట్స్‌లో లెవల్ 2 ADAS ఉన్నాయి.