Site icon NTV Telugu

Ganjai : ట్రాలీ బ్యాగుల్లో 20 ప్యాకెట్ల గంజాయి లభ్యం

Ef2f8736 B9fa 47b6 Ae1f Cf2508650d59

Ef2f8736 B9fa 47b6 Ae1f Cf2508650d59

Ganjai : గంజాయి‌, డ్రగ్స్‌పై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తమ పని తాము చేసుకుపోతాం అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గంజాయి విపరీతంగా దోరుకుతున్నా.. కస్టమర్ల కోసం విదేశాల నుంచి కూడా టాప్ రేటెడ్ గంజాయిని తీసుకు వస్తున్నారు. అలా విమానంలో గంజాయి తెచ్చిన మహిళ పోలీసులకు చిక్కింది. మరోవైపు ధూల్‌పేట్ స్మగ్లర్లు రూట్ మార్చి.. గంజాయి బదులుగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ మహిళ గంజాయి బ్యాగ్‌తో దిగింది. మహిళ తీరుపై అనుమానం వచ్చిన డైరెక్ట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్..DRI అధికారులు తనిఖీ చేశారు. దీంతో ఆమె ట్రాలీ బ్యాగుల్లో 20 ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది… అదేంటీ మన దగ్గరే గంజాయి విపరీతంగా లభ్యమవుతున్నా.. ఆమె విదేశాల నుంచి గంజాయి తీసుకు రావడమేంటి అనుకుంటున్నారా? ఆమె తెచ్చింది సాదాసీదా గంజాయి కాదు.

Read Also : Srushti Ivf Center : బయట పడుతున్న ‘సృష్టి’ లీలలు

దాన్ని హైడ్రోఫోనిక్ గంజాయి అంటారు. ఇది కేవలం సముద్రంలోనే పండుతుంది. సింగపూర్, మలేషియా లాంటి ప్రాంతాల్లోనే ఇది దొరుకుతుంది. దీని స్పెషాలిటీ కూడా వేరుగా ఉంటుంది. అత్యంత కిక్కు ఇచ్చే గంజాయిల్లో ఇదే నంబర్ వన్ అని చెబుతుంటారు. దీన్ని ఒక్కసారి తీసుకుంటే చాలు రోజంతా అదే మత్తు ఉంటుందంటున్నారు. అలాంటి గంజాయినే మహిళ తీసుకు వచ్చింది. ఆమెకు తీసుకు వచ్చిన హైడ్రోఫోనిక్ గంజాయి 13 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాని విలువ దాదాపు రూ. 13 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మహిళ ఆ గంజాయిని బ్యాంకాక్ నుంచి తీసుకు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు..

మరోవైపు హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు ధూల్‌పేట్ ఫేమస్. కానీ ధూల్‌పేట్ స్మగర్లు మాత్రం ఇప్పుడు రూట్ మార్చారు. గంజాయి అమ్మకాలు తక్కువ చేసి డ్రగ్ పెడ్లింగ్ షురూ చేశారు. ఆపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కేజీ 500 గ్రాముల గంజాయితోపాటు 5 జెల్లీ LCD, 0.11 గ్రాముల డోర్స్, 12.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిపైనా కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారిని మహేందర్ సింగ్, అర్జున్ సింగ్, ఎం. అనిల్ కుమార్‌గా గుర్తించారు. హరి ఓం శర్మ, జోడి కృష్ణ, సాజిల్, సుమితా శ్రీధర్ సావెంట్, రోహిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు…

Exit mobile version