Site icon NTV Telugu

HYDRA: మీ చుట్టుపక్కల కబ్జాలపై హైడ్రాకు సమాచారం ఇవ్వాలా..? నంబర్ నోట్ చేసుకోండి..

Hydra

Hydra

చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే తమకు తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి చేసింది. కబ్జాలపై 8712406899 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని హైడ్రాధికారులు వెల్లడించారు. నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నగరానికి వరద ముప్పు తప్పించాలంటే గొలుసుకట్టు చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. వర్షం పడితే వరద నీరు రోడ్లు, నివాస ప్రాంతాలను ముంచెత్తకుండా.. నేరుగా చెరువుల్లోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్న వెల్లడించారు. చెరువులు, నాలాలు ఆక్రమణలు ఆపడం హైడ్రా ముందున్న లక్ష్యమని చెప్పారు. కబ్జాల సమాచారాన్ని అందించాలంటే.. హైడ్రా వాట్సాప్ నంబరు 8712406899 కు ఫోటోలు లొకేషన్ షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే సంబంధిత విభాగం అధికారులు అక్కడికి చేరుకుని సమగ్ర విచారణ చేపడతారు.

READ MORE: Rammohan Naidu : బ్లాక్ బాక్స్ పై ఇండియాలోనే విచారణ : రామ్మోహన్ నాయుడు

Exit mobile version