Site icon NTV Telugu

Hydra: శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. రూ.500 కోట్ల విలువ

Hydra

Hydra

హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. చెరువులు,నాళాలు, ప్రభుత్వ స్థలాలు, బఫర్ జోన్ లోని స్థలాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కబ్జాదారుల నుంచి వందల కోట్ల విలువైన భూములను రక్షిస్తుంది హైడ్రా. ఈ క్రమంలో శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలతో పాటు ప్రహరీ గోడను తొలగించింది. 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ భూమి విలువ రూ. 500 కోట్లు ఉంటుందని తెల్చింది.

Also Read:Sprouts: మొలకెత్తిన ధాన్యాలు పచ్చిగా తింటే మంచిదా? లేక ఉడికించి తింటే మంచిదా?

2011 లో ఈ 12 ఎకరాల భూమిని ఇంటర్మీడియట్ బోర్డకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. కాగా, ఈ భూమి తనదే అంటూ అనీష్ కన్స్ట్రక్షన్ బోర్డు ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టింది.. స్థానికుల సమాచారంతో హైడ్రా కు ఫిర్యాదు చేసిన ఇంటర్మీడియట్ బోర్డు.. రెవిన్యూ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా.. ప్రభుత్వ భూమిగా నిర్ధారించి, కబ్జా నుండి కాపాడింది.

Exit mobile version