NTV Telugu Site icon

AV Ranganath : హైడ్రా కీలక నిర్ణయం.. యాప్‌ను తీసుకువ‌స్తున్న హైడ్రా

Hydra Commissioner Av Ranganath

Hydra Commissioner Av Ranganath

చెరువులకు పూర్వ వైభ‌వం తీసుకువచ్చేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే న‌గ‌రంలో చెరువుల ప‌రిర‌క్షణ‌పై లేక్ ప్రొట‌క్షన్ క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేష‌న్‌, రెవెన్యూ, నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్‌ సెంట‌ర్, స‌ర్వే ఆఫ్ ఇండియా అధికారుల‌తో సోమ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ ,లేక్ ప్రొట‌క్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌ ఏవీ రంగ‌నాథ్ స‌మీక్ష నిర్వహించారు. న‌గ‌రంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావ‌స‌రాల‌కు నిర్దేశించిన స్థలాలు ఆక్రమ‌ణ‌ల‌కు గురి కాకుండా.. నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చ‌ర్యలు చేపట్టింది. ఆక్రమ‌ణ‌ల‌కు ఆస్కారం లేకుండా యాప్‌ను అందుబాటులోకి తీసుకు వ‌స్తోంది హైడ్రా. ఎక్కడ ఆక్రమ‌ణ‌లు జ‌రుగుతున్నా యాప్ ద్వారా స‌మాచారం క్షణాల్లో హైడ్రాకు చేరేలా చ‌ర్యలు తీసుకుంటున్నారు. ఈ యాప్‌లోనే ప్రజ‌లు ఫిర్యాదు చేసే అవ‌కాశం, క్షేత్రస్థాయిలో అధికారుల ప‌రిశీల‌న‌, చ‌ర్యల న‌మోదు ఉంటుంది.

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా స్పెషల్ ఎడిషన్ త్వరలో విడుదల.. డిటైల్స్ లీక్

ఆక్రమ‌ణ‌ల‌కు గురైన చెరువుల‌ను ప‌రిర‌క్షించ‌డ‌మే కాదు.. వాటికి పూర్వవైభ‌వం తీసుకువ‌చ్చే ప‌నిలో హైడ్రా ఉంది. ఆక్రమ‌ణ‌లు తొల‌గించిన చెరువుల్లో డెబ్రీస్‌ను పూర్తి స్థాయిలో తొల‌గించ‌డం, మొద‌టి ద‌శ‌గా సున్నం చెరువు, అప్పాచెరువు, ఎర్రకుంట‌, కూక‌ట్‌ప‌ల్లి న‌ల్లచెరువుతో ప‌నులు ప్రారంభించాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ ప‌రిధిలో ఎన్ని చెరువులున్నాయి, ఎంత మేర ఆక్రమ‌ణ‌లకు గుర‌య్యాయి లెక్కలు తేల్చాలంటూ అధికారుల‌కు సూచించారు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌కు శాస్త్రీయ ప‌ద్ధతుల అనుస‌రించే అంశాల‌పై స‌మీక్ష నిర్వహించారు. గ‌తంలో నిర్ధారించిన ఎఫ్‌టీఎల్ స‌రిగా లేని ప‌క్షంలో వాటిని స‌వ‌రించేందుకు చ‌ర్యలు చేపట్టనున్నారు.

Congress vs MIM : ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్‌, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ

45 ఏళ్ల డేటా ఆధారంగా చెరువుల ఎఫ్‌టీఎల్‌, మాగ్జిమ‌మ్ వాట‌ర్ స్ప్రెడ్ ఏరియా గుర్తించనున్నారు. ఇందుకు ఎన్ఆర్ఎస్ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్‌ సెంట‌ర్, ఇరిగేష‌న్ విభాగాల డేటాతో స‌రిపోల్చి నిర్ణయం తీసుకోనున్నారు. విలేజ్ మ్యాప్స్‌, భూ వినియోగం సర్వే నంబ‌ర్లతో స‌హా స‌మ‌చారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్స్ , 45 ఏళ్లలో పూర్తి స్థాయిల చెరువు నీరు విస్తరించిన తీరుపై స‌మాచారం సేక‌రించనున్నారు. హిమాయ‌త్ సాగ‌ర్‌తో ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విష‌యంలో పాటించేందుకు చ‌ర్యలు చేపట్టనున్నారు. చెరువుల ఆక్రమ‌ణ‌ల‌పై 2018లో కాగ్ ఇచ్చిన నివేదిక ప‌రిశీలించి, ఎక్కడా ఎలాంటి పొర‌పాట్లకు ఆస్కారం లేకుండా చెరువుల‌ను గుర్తించేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. చెరువుల ప‌రిర‌క్షణ‌పై ఇత‌ర రాష్ట్రాల్లో అనుస‌రిస్తున్న విధానాల‌పైనా స‌మీక్ష నిర్వహిస్తున్నారు.

Tomato Price : మళ్లీ మోత మోగిస్తున్న టమాటా ధర.. హైదరాబాద్ లో కిలో రూ.100