Site icon NTV Telugu

HYDRA : మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా

Hydra Commissioner Ranganath

Hydra Commissioner Ranganath

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌-అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణను చూసుకుంటుంది. అయితే.. అక్రమ నిర్మాణల కూల్చివేతలపై బుధవారం హైడ్రా వివరాలు వెల్లడించింది. మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా పేర్కొంది. ఇందులో భాగంగా జూన్ నుంచి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోతున్న హైడ్రా కూల్చివేతల వివరాలను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం..గ్రేటర్ పరిధిలో జూన్ 27 నుంచి ఇప్పటి వరకు మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు తెలిపింది. దీంతో 111.71 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో . గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్‌లో 54 నిర్మాణాలు, రాజేంద్రనగర్‌ 45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలు తొలగించినట్లు ప్రకటించింది.

Bandi Sanjay : అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది

Exit mobile version