NTV Telugu Site icon

Hydra : పెండింగ్ లో 10వేల ఫిర్యాదులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజెంటేషన్

Ranganath

Ranganath

Hydra : హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఆన్ లైన్ లో కూడా భారీగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు వేగంగా పనిచేస్తున్నామని రంగనాథ్ వివరించారు. హైడ్రా అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారనేదానిపై కమిషనర్ రంగనాథ్ బుధవారం ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని విధాలుగా తాము ప్రజలకు సహకరిస్తున్నామని.. ప్రభుత్వ భూముల్లో ఎవరు బిల్డింగులు కట్టినా విడిచిపెట్టేది లేదన్నారు.

Read Also : Off The Record: కోనప్ప, ఐకే రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు?

ఇప్పటి వరకు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల్లో 10వేల వరకు పెండింగ్ లో ఉన్నట్టు స్పష్టం చేశారు. వాటన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. గతంతో పోలిస్తే హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు, శిఖం భూముల్లో ఆక్రమణలు జరగట్లేదన్నారు. సిటీని క్లీన్ గా ఉంచేందుకు హైడ్రా కృషి చేస్తోందన్నారు. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేస్తామని బాధితులంతా అక్కడే ఫిర్యాదులు చేయొచ్చన్నారు.