NTV Telugu Site icon

Hyderabad: హల్వా తిన్న మహిళ.. మరుసటి రోజు

Food Poisun

Food Poisun

Hyderabad: నగరంలో ఆహార పదార్థాల కల్తీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన మాంసాన్ని వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా.. లక్డీకపూల్‌లోని ద్వారకా హోటల్‌లో హల్వా తిని ఓ మహిళ అస్వస్థతకు గురైంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read also: Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..

ఈనెల 23న స్రవంతి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్కాజిగిరి ప్రాంతంలోని ద్వారకా హోటల్‌కు వచ్చింది. హోటల్‌లో క్యారెట్ హల్వా తిన్న ఆమెకు డీహైడ్రేషన్, కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. అనంతరం ఫుడ్‌ పాయిజన్‌ అయిందని బాధితురాలు ఖైరతాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించి ఫుడ్‌ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు ఖైరతాబాద్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఈనెల 23న రామేశ్వరం కేపులో నిర్వహించిన తనిఖీల్లో మార్చి నెలలో గడువు ముగిసిన 100 కిలోల మినపప్పు దొరికినట్లు తెలిపారు. దీని విలువ 16 వేలు ఉంటుందని చెప్పారు. అలాగే కాలం చెల్లిన పది కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంజారా హిల్స్ , సికింద్రాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించామని తెలిపారు. ప్రజలు బయట ఫుడ్ తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Wines Shops Closed: నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్..

Show comments