Wines Shops Closed: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో చేదు వార్త అందించింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా లేదని, కొన్ని జిల్లాల్లో మాత్రమేనని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27వ తేదీ సోమవారం జరగనుంది.ఈ ఎన్నికల పోలింగ్‌కు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాలకు చెందిన పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో సైలెంట్ పర్వం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మే 27వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయాలని అధికారులు ప్రకటించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మాత్రమే మద్యం దుకాణాలు, బార్లు బంద్ ఉంటాయని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లపై మద్యం ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Read also: Amma Rajasekhar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న అమ్మ రాజశేఖర్ తనయుడు..
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఆ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. మళ్లీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత వైన్ షాపులు, బార్లు తెరుచుకోనున్నాయి.
Lokshabha Elections 2024: నేడు లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్.. లైవ్ అప్ డేట్స్