Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Jam: దసరా పండుగ సెలవులు ముగియడంతో నగరవాసులు మళ్లీ రాజధాని బాట పట్టారు. పల్లెల్లో వేడుకలు ఘనంగా ముగించుకుని తిరుగు ప్రయాణం కావడంతో హైదరాబాద్‌కు దారితీసే అన్ని ప్రధాన రహదారులు జనసందోహంతో, వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. గురువారం నుంచి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పునఃప్రారంభం కానుండటంతో లక్షలాది మంది ప్రజలు ఒకేసారి నగరానికి తరలివస్తున్నారు. దీంతో శివారు రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65), వరంగల్–హైదరాబాద్ (NH-163) మార్గాల్లో వాహనాలు చీమల దండులా బారులు తీరాయి. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో టోల్‌ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, బీబీనగర్ సమీపంలోని రాయగిరి, గూడూరు టోల్గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. చౌటుప్పల్ సమీపంలో దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.వాహనాల రద్దీ అమాంతం పెరగడంతో పోలీస్, రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీలక జంక్షన్లలో ప్రత్యేక బృందాలను మోహరించారు.చౌటుప్పల్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు. వరంగల్, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వైపు సాఫీగా మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా ఉండేందుకు ఫాస్టాగ్ (FASTag) స్కానర్లను ముందస్తుగానే తనిఖీ చేసి, అదనపు సిబ్బందితో హ్యాండ్‌హెల్డ్ మెషీన్ల ద్వారా ఫాస్ట్‌గా టోల్ రుసుము వసూలు చేసేలా పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర వాహనాలు, అంబులెన్సుల కోసం ప్రత్యేక లేన్లను కేటాయించారు.
మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణికుల రాకతో రద్దీగా మారాయి. ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోయి నగరానికి చేరుకుంటున్నాయి. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా వాహనాల రాక మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రధాన మార్గాల్లో గస్తీ ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!