NTV Telugu Site icon

Protest of stone masons: హైదరాబాద్ లో కల్లు గీత కార్మికుల ఆందోళన

Protest

Protest

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ లో కల్లు గీత కార్మికుల ఆందోళనకు దిగారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల వెంకట రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపోతుల వెంకట రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కల్లు గీస్తున్న గీత కార్మికులకు భరోసా లేదు అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Ashtadigbandhanam Review: అష్ట దిగ్భంధనం రివ్యూ

కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలి అని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల వెంకట రమణ తెలిపారు. ప్రతి కల్లుగీత సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలనే జీవో నెంబర్ 565 అమలు చేయాలి.. 2023-24 బడ్జెట్ లో కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం.. ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కల్లు గీత కార్మికులు గుణపాఠం చెబుతారు అని వెంకట రమణ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేకపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Read Also: Asian Games: అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా.. పర్యటన రద్దు చేసుకున్న కేంద్రమంత్రి..

Show comments