Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక పెట్రోల్ ధర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Petrol Price: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరల మోత మోగింది. చమురు విక్రయ సంస్థలు (OMCs) పెంచిన ధరల కారణంగా మే 15న దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. తాజా పెంపుతో దేశంలోని ప్రముఖ నగరాలన్నింటికంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్నాయి. నగరంలో లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ. 3.39 పెరగడంతో ప్రస్తుతం లీటరు ధర రూ. 110.89 కి చేరింది. ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం రెండో స్థానంలో నిలిచింది. అక్కడ రూ. 3.37 పెరగడంతో లీటరు పెట్రోల్ ధర రూ. 110.75 కి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా (రూ. 108.74), పాట్నా (రూ. 108.55), జైపూర్ (రూ. 108.19) నిలిచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ. 106 దాటి లీటరు రూ. 106.64 వద్ద విక్రయిస్తున్నారు.
పెట్రోల్‌తో పాటే డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పైపైకి దూసుకెళ్లాయి. లీటరు డీజిల్ ధర అత్యధికంగా తిరువనంతపురంలో రూ. 99.63 (రూ. 3.37 పెంపు) గా నమోదై, సెంచరీ మార్కుకు చేరువులో నిలిచింది. ఈ జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌పై రూ. 3.26 పెరగడంతో ధర రూ. 98.96 కి ముట్టింది. ఆ తర్వాత భువనేశ్వర్ (రూ. 96.11), చెన్నై (రూ. 95.47), కోల్‌కతా (రూ. 95.13)లు ఉన్నాయి. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 97.77 గాను, డీజిల్ ధర రూ. 90.67 గాను కొనసాగుతోంది. ఈ ఆకస్మిక ధరల పెరుగుదల రవాణా రంగంతోపాటు సామాన్యుడి జేబుకు చిల్లుపడనుంది.
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!