Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?

Hyderabad Rajendranagar

Hyderabad Rajendranagar

Hyderabad: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడును తలపించే శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 9:15 గంటల సమయంలో ఎర్రబోడ, ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్, అత్తాపూర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ భారీ శబ్దాలు వినిపించాయి. శబ్దం వచ్చిన సమయంలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో, అసలేం జరిగిందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు, భవనాల పైకి పరుగులు తీశారు. ఎక్కడైనా నిజంగానే పేలుడు సంభవించిందా లేక భూకంపం వచ్చిందా అనే అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సంఘటనతో స్థానికులు భయం గుప్పిట్లో మునిగిపోగా, భూమి కంపించిందంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ భారీ శబ్దం వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడానికి వెంటనే రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు.