Site icon NTV Telugu

Kondapur Pub: డిస్కౌంట్ విషయంలో గొడవ.. పబ్‌ సిబ్బందిపై 20 మంది విచక్షణారహితంగా దాడి!

Sam

Hyderabad Pub Clash

స్నేహితులంతా కలిసి పబ్‌కు వెళ్లారు. అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు. బిల్లు కట్టే విషయంలో డిస్కౌంట్ పేరుతో గొడవకు దిగారు. పబ్‌లో ఉన్న బౌన్సర్లు, మేనేజర్లతో పాటు ఇతర సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే పబ్‌లో మద్యం మత్తులో ఓ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. కొండాపూర్ వైట్‌ఫీల్డ్‌లో ఉన్న మ్యాడ్ కిచెన్ అండ్ పబ్‌లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివ, జితేశ్, ప్రశాంత్, సదానంద్​పాటు సుమారు 20 మంది యువకులు కొండాపూర్​ వైట్​ఫీల్డ్​ రోడ్డులో ఉన్న మ్యాడ్​ క్లబ్​ పబ్‌కు వెళ్లారు. అందరూ కలిసి ఫుల్​గా మద్యం తాగారు. వారి బిల్లు రూ.18 వేలు అయింది. బిల్లు చెల్లించే సమయంలో డిస్కౌంట్ అడిగారు. కానీ పబ్ నిర్వాహకులు డిస్కౌంట్ లేదని చెప్పడంతో.. తాము పబ్ ఓనర్‌కు సంబంధించిన వారమని వాదించారు. అక్కడ ఉన్న పబ్​ మేనేజర్‌తో గొడవ పడ్డారు. పబ్ ఓనర్‌ను పిలవాలంటూ హంగామా చేశారు. ఐతే అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై దాడికి పాల్పడ్డారు.

Also Read: Online Fraud: చదివింది ఇంటరే కానీ.. చేసింది మాత్రం బెట్టింగ్ యాప్! చివరకు

పబ్‌లో యువకులు చేస్తున్న హంగామా అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. మేనేజర్‌తో గొడవ పడుతున్న సమయంలో బౌన్సర్లు అడ్డుకున్నారు. ఐతే వారిపై వాటర్ బబుల్స్‌, బాటిల్స్, రాడ్స్, ఖాళీ సీసాలు కర్రలు.. ఇలా చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. దీంతో ఈ దాడిలో బౌన్సర్లు అఫ్రోజ్,​ ప్రశాంత్, మాజీద్​, రషీద్​, చరణ్​ గాయపడ్డారు. వారిని కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పబ్‌ ఓనర్‌ ప్రశాంత్‌ మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version