Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది.. బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు వణికి పోతున్నారు.. సినీ రాజకీయ టీవీ రంగాన్ని చెందిన నటీనటులు బెట్టింగ్ యాప్‌ల కొరకు ప్రచారం చేశారు.. దీనికి తోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పించారు.. దీనికి తోడు మంచు కుటుంబంలో సెన్సేషనల్ అయిన మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేశారు.. మరోవైపు ఆగ్ర హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం నిర్వహించారు. అయితే బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసి యువత జీవితానికి నాశనం అయ్యే విధంగా చేస్తున్న సెలబ్రిటీల పైన పోలీసులు కొరడా జరిపిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 11 మంది సెలబ్రెటీల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో సినీ రాజకీయ రంగంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ పైన కూడా కేసు పెట్టారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసి కోట్ల రూపాయలను సంపాదించిన హర్ష సాయి, సన్నీ యాదవ్, రాజు భయ్యా, నటి శ్యామల, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్ టేస్టీ సన్నీ ఎలా మొత్తం 11 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ 11 మంది కూడా బెట్టింగ్ యాప్స్ కోసం పలు కంపెనీలకు ప్రచారం చేశారు.. ఆ కంపెనీల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు.. అయితే వీళ్ళు ప్రచారాన్ని నమ్మి చాలా మంది యువకులు బెట్టింగ్ యాప్స్‌లో తమ జీవితాన్ని పణంగా పెట్టారు.. చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. కొంతమంది చావు బతుకుల మధ్య ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు.. ఇంకా చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూనే ఉన్నారు.. ఈ సెలబ్రిటీలు చేస్తున్న ప్రచారానికి చాలామంది ఆకర్షితులై వాటిలో పెట్టుబడి పెట్టారు.. గేమ్స్ ఆడారు.. డబ్బులు పోగొట్టుకున్నారు.. చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు.. అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రమాదం తీవ్రతరం అవుతుందని గుర్తించిన పోలీసు అధికారులు సెలబ్రిటీల పైన కేసులు పెట్టారు.. వాళ్లని విచారిస్తామని చెప్తున్నారు.. అవసరమైన పక్షంలో అరెస్టు కూడా చేస్తామని ప్రకటించారు.. మరోవైపు ఇందులో హవాలా, మనీ లాండరింగ్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఆమెరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కూడా సమాచారం ఇస్తామని చెప్తున్నారు. ఏ సెలబ్రిటీ ఏ బెట్టింగ్ యాప్ కోసం ప్రచారం చేస్తారు.. వాటి వివరాలను సేకరిస్తున్నామని సేకరించిన వివరాల ఆధారంగా అందరికీ నోటీసులు జారీ చేస్తామని, వాళ్లందర్నీ విచారిస్తామని బెట్టింగ్ యాప్ కి ప్రచారం చేస్తే డబ్బులు తీసుకున్నారో విషయాన్ని బట్టబయలు చేస్తామని, కేవలం వ్యూస్ కోసమే ఇది చేసినప్పటికీ ఆమెకు చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.
మాకు వ్యూస్ కావాలి.. మాకు ప్రచారం చేస్తే డబ్బులు కావాలి.. ఎవడు ఎటు పోతే మాకేంటి. మాకు మాత్రం డబ్బులు కావాలి.. సోషల్ మీడియాలో వ్యూస్ కావాలి. ఈ రెండే మా లక్ష్యం అది తప్పించి వేరే లక్ష్యం కాదు మేము చేసే ప్రచారానికి ఆకర్షితులై మీరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న మాకు ఏం సంబంధం లేదు. మీరు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు. మీరు రోడ్డున పడి గిలగిల కొట్టుకున్నా మాకు సంబంధం లేదు. మాకు మాత్రం వ్యూస్ కావాలి. మాకు డబ్బులు కావాలి. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.. అయితే దీనిని ఐపీఎస్ అధికారి సజ్జన తీవ్రంగా తీసుకున్నాడు.. జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రచారకులపై కొరడా జూలిపించారు.. హర్ష సాయి, సన్నీ భయ్యా ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో చాలామంది బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేయించి లోపల వేయిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు అయిన యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో తాము పెట్టే వీడియోలలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్లకి బెట్టింగ్ యాప్స్ కంపెనీలు కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళ యాడ్స్ ని ప్రమోట్ చేయించుకుంటున్నాయి.. తాము ఫలానా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు కూడా డెమో వీడియోలను పెడుతున్నారు.
ఈ సో కాల్డ్ ఇన్ ఫ్లూయెన్సర్లు చెప్పేదంతా నిజమనే భావనలో ఉన్న కొందరు సదరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. మొదట్లో తక్కువ మొత్తంతో మొదలై ఆ తర్వాత లక్షలకు చేరుకుంటుంది. చివరకు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్తుంది. రెండు రాష్ట్రాలను ఇప్పుడు షేక్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ పైన పోలీసులు ఎక్కడపడితే అక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. వీటికి ప్రచారం చేసిన వాళ్లని పిలిచి విచారించి అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నటి మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ కూడా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశారు. వీళ్లిద్దరిని కూడా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకున్నందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మంచి నటనలో ఉండి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన వీళ్ళ పైన కూడా కేసులు పెట్టామని ఆ ఇద్దరి పైన చర్యలు కూడా తీసుకుంటామని పోలీస్ అంటున్నారు.. అంతేకాకుండా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశాడు. అతన్ని పైన కూడా చర్యలు తీసుకున్నందుకు రంగం సిద్ధమైంది..