Hyderabad: భాగ్యనగరంలో వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ వంటి భారీ గణేశ మండపాల నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. కొందరు పోకిరీలు భక్తి ముసుగులో రక్తి కార్యకలాపాలు సాగిస్తున్నారు. గణేశుడి దర్శన సమయంలో.. నిమజ్జనోత్సవాల్లో.. జనం ఎక్కువగా ఉండడం చూసి.. మహిళలను అసభ్యంగా తాకి.. ఆనందం పొందుతున్నారు. అక్కడ చాలామంది వున్నారు. అది చూస్తే, రద్దీ ఎక్కువగా ఉండడంతో పొరపాటున తాకినట్లు ఉంటుందని ధీమాగా ఉంటారు. కానీ.. అలాంటి పోకిరీలపై హైదరాబాద్ షీ టీమ్స్ డేగ కన్ను వేసింది. విగ్రహాలు పెట్టినప్పటి నుంచి నిమజ్జనం ముగిసే వరకు మహిళలను అసభ్యకరంగా తాకిన వారిని పోలీసులు గుర్తించి కటకటాల్లోకి పంపారు. అడ్డగోలుగా బుక్ అయిన ప్రభుద్దులు 280 మందికి పైగా ఉండడం గమనార్హం.
బడా గణేశుడి దర్శనం సమయంలో నిమజ్జనోత్సవం సందర్భంగా మహిళలతో పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. నిమజ్జన శోభాయాత్రలో ఈ పోకిరీలు ఎక్కువగా కనిపించారని పోలీసులు తెలిపారు. షీటీమ్స్ స్పై ఆపరేషన్ చేసి దురుసుగా ప్రవర్తించిన పోకిరీలను పట్టుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కాగా, నిమజ్జనం సందర్భంగా ఒకేసారి 280 మంది పోకిరీలను పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా.. నిమజ్జనం సమయంలో.. చైన్ స్నాచింగ్, ఇతర వేధింపులు, దొంగతనాలు వంటి కేసులు నమోదు కాలేదు. అయితే పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా తాకి ఎలా ఆనందాన్ని పొందారో తెలిపేందుకు పోలీసులు మచ్చుకు కొన్ని వీడియోలను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేయడం గమనార్హం. అయితే గణేశుడి విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో పోలీసులు పోకిరీలకు వార్నింగ్ ఇచ్చారు. “మీ ప్రతి కదలికను గమనిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.” అంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రెండు వీడియోలను షేర్ చేస్తూ, ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం మానుకుని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. కానీ.. ఈ హెచ్చరికలను బేతాఖాతరు చేసిన పోకిరీలు రెచ్చిపోయి మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ పోలీసుల డేగ కంటికి అడ్డంగా దొరికిపోయారు.
Rs.2000 Notes: నేడే లాస్ట్ ఛాన్స్.. రూ. 2000 నోట్లను మార్చుకోండి లేదంటే..!
