Hyderabad: హైదరాబాద్‌లో బంకులు మూసివేత వెనుక అసలు కారణం ఇదే.. కొత్త రూల్స్‌తో జనాల్లో పానిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Panic in Hyderabad: నగరంలో ఒక్కొక్కటిగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. దీంతో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున నగరంలోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున లైన్లు దర్శనమిచ్చాయి. మరోవైపు.. ఎల్‌పీజీ, సీఎన్జీ బంకుల్లో ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నాయి. లక్డీకపూల్, గచ్చిబౌలి, అంబర్‌పేట్, దిల్‌షుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లోని బంకుల్లో ఆటోలను రోడ్లపై నిలిపి వేశారు. ఎల్‌పీజీ, సీఎన్జీ బంకుల్లో ఆలో లైన్లు భారీగా కనిపిస్తున్నాయి. నగదు ఇస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామంటూ ఆయిల్ కంపెనీలు కొత్త మెలిక పెట్టడంతో హైదరాబాద్‌లో కొన్ని బంకులకు సరఫరా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో నగదు లేక చాలా మంది డీలర్లు పెట్రోల్, డీజిల్ కొనడం ఆపేశారు. ఇంతకుముందు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవి. అయితే ఈ నెలలో క్రెడిట్ సదుపాయం ఇవ్వకపోవడంతో డీలర్లు బంకులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అయితే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఇప్పటివరకు ఇస్తున్న క్రెడిట్ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాయి. దీంతో డీలర్లు డబ్బులు చెల్లిస్తేనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌లను సరఫరా చేస్తున్నాయి. ఇక ఈ అంశంపై పెట్రోల్ బంకు యజమాలనులు మాట్లాడుతూ.. మార్చి 31వరకు అమల్లో ఉండే ఆయిల్ కంపెనీల నిబంధనలే తాజా పరిస్థితికి కారణమని చెబుతున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డీలర్లు, పెట్రోలియం శాఖ వెల్లడించింది.
READ MORE: Military Plane Crashed: ఘోర ప్రమాదం.. కూలిన సైనిక విమానం.. 110 మంది సైనికులు!
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!