Site icon NTV Telugu

Hyderabad: రూ.5,000 కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్.. డీజీజీఐ దాడుల్లో షాకింగ్ నిజాలు

Gst

Gst

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు అయ్యింది. ఫినటెక్ ముసుగులో రూ. 5,000 కోట్ల దందాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) పట్టుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయల మళ్లింపు చేస్తున్నట్లు డీజీజీఐ గుర్తించింది. 5 వేల కోట్ల రూపాయలు టాక్సీ ఎగ్గొట్టి దుబాయ్‌కి మళ్లించినట్లు తేలింది. టెక్నాలజీని వాడిన హైదరాబాద్ వాసులు బ్యాంకులకే టోకరా వేశారు. ఓటీపీ (OTP) లేకుండానే 5 వేల కోట్లు నిధుల బదలాయింపు జరిపారు. దుబాయ్ కేంద్రంగా ‘మాస్టర్ మైండ్’ కొనసాగింది.. హైదరాబాద్‌లో తీగ లాగితే కదిలిన డొంక కదిలింది.

READ MORE: India vs Pakistan: నష్టపరిహారం, సస్పెన్షన్.. పీసీబీ, ఐసీసీ మీటింగ్ లేటెస్ట్ డీటెయిల్స్ ఇవే!

నిబంధనలకు విరుద్ధంగా రియల్ మనీ గేమింగ్.. జీఎస్టీ (GST) ఎగ్గొట్టేందుకు ఎస్క్రో (Escrow) ఖాతాల వినియోగించినట్లు డీజీజీఐ తెలిపింది. ఓషియానిక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్‌విన్ సొల్యూషన్స్ అనే నకిలీ (Shell) కంపెనీల ద్వారా నిధుల మళ్లించారు. funinmatch360, raceje-et247 వెబ్‌సైట్ల ద్వారా అక్రమ దందా సాగింది. బ్యాంకింగ్ APIలను దుర్వినియోగం చేసి, ఆడిట్‌కు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు కేటుగాళ్లు. ‘విగోఫిన్’ (Wegofin) డైరెక్టర్లు ప్రభు కుమార్, రాజశేఖర్ రెడ్డిలపై అధికారుల నిఘా పెట్టారు. ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు గుర్తించారు.

READ MORE: 1,200 నిట్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్తో రేపే Oppo K14x 5G లాంచ్..

Exit mobile version