Site icon NTV Telugu

Hyderabad: పాతబస్తీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, నలుగురికి గాయాలు.. ఉద్రిక్తత వాతవరణం

Fight

Fight

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని చాదర్ ఘాట్ శంకర్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో కత్తులు, తల్వార్లు ఉపయోగించడంతో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘర్షణకు మూడు రోజుల క్రితం జరిగిన చిన్నపాటి గొడవ కారణమని పోలీసులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి ఇరు వర్గాలు మాట్లాడుకోవడానికి కలుసుకున్నారు.

Trump: యూఎన్‌లో కుట్ర జరిగింది.. కారకాల అరెస్ట్‌కు ట్రంప్ ఆదేశాలు

అయితే, మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో ఒక వర్గం కత్తులు, తల్వార్లతో మరో వర్గంపై దాడి చేసిందని పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన దుండగులు పరారయ్యారు. చాదర్ ఘాట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది.

Trump: నేడు ట్రంప్‌తో షెహజాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ భేటీ.. నిశితంగా పరిశీలిస్తున్న భారత్

Exit mobile version